Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కారు యాక్సిడెంటులో చనిపోయిన స్కూటరిస్ట్.. హీరోయిన్ జరీన్ ఖాన్ పై కేసు నమోదు!

  • గోవా రాజధాని పనాజీలో రోడ్డు ప్రమాదం
  • హీరోయిన్ జరీన్ ఖాన్ కారు ఢీకొని యువకుడి దుర్మరణం
  • పోలీసులను ఆశ్రయించిన మృతుడి సోదరుడు
బాలీవుడ్ నటి, హీరోయిన్ జరీన్ ఖాన్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి గోవా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. జరీన్ ఇటీవల ఓ కార్యక్రమం నిమిత్తం గోవా చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె వెళుతున్న కారు ఓ బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటర్ పై వెళుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో మృతుడి సోదరుడు విశాల్ పనాజీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

జరీన్ కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని, తన ఎంజాయ్ మెంట్ కోసం కారును వేగంగా పోనిచ్చిందని ఆరోపించాడు. డ్రైవర్ ఇష్టానుసారంగా వేగంగా వాహనాన్ని నడుపుతున్నా, కనీసం అతడిని వారించే ప్రయత్నం చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు విశాల్ ఫిర్యాదుతో పనాజీ పోలీసులు జరీన్, ఆమె డ్రైవర్ అబ్బాస్ పై కేసు నమోదు చేశారు. వారిద్దరి నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. సల్మాన్‌ ఖాన్‌కు జోడీగా ‘వీర్‌’ సినిమాతో బాలీవుడ్ లో జరీన్ అరంగ్రేటం చేసింది. ‘హౌస్‌ఫుల్‌ 2’, ‘హేట్‌స్టోరీ 3’, ‘అక్సర్‌ 2’ తదితర సినిమాల్లో జరీన్ నటించి మెప్పించింది.
Road Accident
Bollywood
jareenkhan
Police
goa

More Telugu News